Skip to main content

Posts

Latest Update

2024

జీవితం.. కొన్ని సంవత్సరాల కాలం కొంతమందితో స్నేహం ఎన్నో ఆశలు అంతేలేని ఆలోచనలు ప్రతిసారి మళ్లీ కొత్తగా పుట్టాలనే కోరిక ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకోవాలనే ప్రయత్నం ఏదైనా సాధించాలిని,  ప్రపంచం మనల్ని గుర్తించాలిని, వీలైతే ఈ ప్రపంచాన్ని చుట్టేయాలిని, పగలు రాత్రి తేడా లేకుండా కంటున్న కలలు. అవి నిజమైతే చూడాలని అమ్మ, నాకన్నా నన్ను ఎక్కువగా నమ్మే స్నేహితులు, ఈ జీవితానికి ఇంకేం కావాలి అనుకునే లోపే ఏ నేను అక్కర్లేదా, అని పలకరించి వెళ్లిపోయే ప్రేమ. ఎన్ని కొత్తగా మొదలయ్యే సంవత్సరాలు మారినా, సమస్యలతో సర్దుకుపోవడం అలవాటుపడిన ప్రాణాలకి  ఆ సర్లే అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది అని నచ్చచెప్పుకోవడంతోనే రోజులు గడిచిపోతాయి.. రోజు చిరాకు పరాకులతో మొదలవ్వకుండా రోజు పూర్తయ్యాక బాధపడకుండా పడుకున్న వెంటనే నిద్రపట్టే ప్రశాంతత కోసం మాత్రమే ఆరటపడే అతిచిన్న జీవితం నాది... ధన్యవాదాలు రెడ్డి ప్రసాద్ మల్లెల

Latest Posts

తిరుపతి

Happy Happy Happy

నువ్వుంటే బాగుండేది

ఇంతేనా

జీవంలేని మాటలు

నిలిచిపోయాను..

ఇలా బ్రతకాలని ఉంది..

ఆఖరి మజిలీ 4

ఆఖరి మజిలీ 3

ఆఖరి మజిలీ 2